BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 20 May 2026, 10:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 May, 2026 - 10:18 PM
161 వీక్షణలు

నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం

నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివారులోని నల్లమలను ఆనుకుని ఉన్న గట్టు తాండ వద్ద పెద్దపులి సంచారం భయాందోళనలు కలిగిస్తోంది. గట్టు తాండాకు చెందిన రెడ్యా నాయక్‌కు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేయగా, ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులకు ఆవుల మంద యజమాని రెడ్యా నాయక్ ఫిర్యాదు చేశారు.

పెద్దపులి అడవిని వదిలి గ్రామ శివార్లకు రావడంతో మరిన్ని పశువులపై దాడులు జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పులి అడుగుజాడలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.