BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 05 July 2026, 05:47 am
Posted by : గడ్డమీది రమేష్

శనిగరం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ మరియు మడలేశ్వర స్వామి బోనాలు

భక్తి భక్తి
Reporter
గడ్డమీది రమేష్ కోహెడ మండల ప్రతినిధి
05 Jul, 2026 - 05:47 AM
643 వీక్షణలు

సిద్దిపేట జిల్లా | NTODAY NEWS

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామదేవత పోచమ్మ తల్లి మరియు నల్ల పోచమ్మ బోనాల ఉత్సవాలను శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రజక సంఘ సభ్యులు ఇంటింటా బోనాలు చేసి గ్రామదేవత పోచమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నల్ల పోచమ్మ ఆలయానికి బోనాలతో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించి దర్శనం చేసుకున్నారు.

అలాగే నూతనంగా నిర్మించిన మడలేశ్వర స్వామి ఆలయానికి బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఓడి బియ్యం పోసి తమ మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు మందపల్లి రమేష్, ఉపాధ్యక్షుడు జలగం రాజయ్య, సంఘ గౌరవ పెద్దలు, రజక యూత్ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.