BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 04 July 2026, 09:34 pm
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

శంకర్ బ్రిడ్జి నిర్మాణం వలన ఉపాధి కోల్పోతున్న షాపు ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలి సిఐటియు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
04 Jul, 2026 - 09:34 PM
99 వీక్షణలు

గుంటూరు నగర షాప్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నేడు లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి తదుపరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ గాయత్రీ దేవి గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగినది .ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులుకే శ్రీనివాసరావు  సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర విలాస్ సెంటర్లో బ్రిడ్జి నిర్మించడంలో భాగంగా ఆ పరిసర ప్రాంతంలో వివిధ షాపులలో పనిచేస్తున్న షాపు ఉద్యోగులకు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ఈ విధంగా ఉపాధి కోల్పోయిన వారికి 2013 భూ సేకరణ చట్టం కారం షాపు యజమానులతో పాటు అందులో పని చేస్తున్న సేల్స్ మెన్స్, గుమ్మస్తాలు, సూపర్వైజర్లు,  అందరికీ ప్రభుత్వం వైపు నుంచి పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా నిర్మించడానికి ముందుగా రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మిస్తే ఇటు ప్రయాణికులకు అటు షాపు యజమానులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. అలా కాకుండా  నిర్మించడం వలన గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లేవారు, కోర్టు కాంపౌండ్ కు వెళ్లేవారు, మెడికల్ కాలేజీకి వెళ్లేవారు హిందూ కాలేజీ కూడలి దాకా వెళ్లి తిరిగి రావాల్సి వస్తుందని ఆయన అన్నారు. ముందుగా ఆర్ యు బి నిర్మించడం వలన వాహనదారులతో పాటు షాపు వ్యాపారులకి అందులో పని చేస్తున్న ఉద్యోగులకి ఉపయోగకరం గా ఉంటుందని ఆయన అన్నారు. సర్వీస్  రోడ్లు తగినంతగా లేకపోవడం వలన అటు వాహనదారులు ఇటు వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు, గోపి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.