BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 20 May 2026, 10:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 May, 2026 - 10:24 PM
208 వీక్షణలు

ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం-1 వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకం మానుకుని రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారవంతం పెరగడంతో పాటు రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయ ఎఫ్‌ఎమ్‌టీ కన్నమ్మ, ఐసీఆర్‌పీలు మాధవి, నాగమణి, చక్రధర్ రైతులకు నవధాన్యాల పచ్చిరొట్ట ఎరువు ఉపయోగాలపై వివరించారు. ఒకే రకం పచ్చిరొట్ట ఎరువుకంటే వివిధ రకాల చిరుధాన్యాలను కలిపి వాడడం వల్ల పైరుకు నత్రజని, భాస్వరం తో పాటు సూక్ష్మపోషకాలు కూడా అందుతాయని తెలిపారు.

అవసరమైన రైతులకు 10 కిలోల చొప్పున రూ.1000కు సరఫరా చేస్తామని చెప్పారు. 18 రకాల ధాన్యాలతో తయారుచేసిన పచ్చిరొట్ట ఎరువు వాడకం ఎంతో ప్రయోజనకరమని మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, కళ్ళేపల్లి మారేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.