BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 May, 2026 - 08:40 PM
11 వీక్షణలు

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. “మేము చెప్పిందే చట్టం” అంటూ కుల పెద్దల వేధింపులు

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో కుల కట్టుబాట్ల పేరుతో ఓ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొన్ని నెలలుగా ఆ కుటుంబాన్ని గ్రామ శుభకార్యాలకు దూరంగా ఉంచడంతో పాటు, వారి ఇంట్లో జరిగే కార్యక్రమాలకు గ్రామస్తులు, బంధువులు వెళ్లకుండా కుల పెద్దలు అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గౌడ సామాజిక వర్గానికి చెందిన చీపి మల్లయ్య స్వామి కుమార్తె నాగలక్ష్మి 2023లో కాపు సామాజిక వర్గానికి చెందిన మొద్దు తేజ సత్యనారాయణను ప్రేమ వివాహం చేసుకుంది. కులాంతర వివాహం కారణంగా మొదట నాగలక్ష్మి కుటుంబ సభ్యులే ఆ వివాహాన్ని వ్యతిరేకించారని, అనంతరం నాగలక్ష్మి అనారోగ్యానికి గురికావడంతో ఆమె తల్లి మంగమ్మ కుమార్తె, అల్లుడిని ఇంటికి తీసుకొచ్చిందని తెలిపారు.

అక్కడి నుంచే తమపై కుల పెద్దల వేధింపులు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో జరిగే ఏ శుభకార్యానికి తమను పిలవనివ్వకపోవడం, ఇతరులు కూడా తమ ఇంటికి రాకుండా అడ్డుకోవడం జరుగుతోందని వాపోయారు.

ఇటీవల నాగలక్ష్మికి కుమారుడు జన్మించడంతో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. బంధువులు, గ్రామస్తులను ఆహ్వానించినప్పటికీ, కుల పెద్దలు ఎవ్వరినీ ఆ కార్యక్రమానికి వెళ్లనీయలేదని తెలిపారు. విందు కోసం సిద్ధం చేసిన ఆహారం మొత్తం వృథా అయిందని, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారని చెప్పారు.

అదే రోజు అర్ధరాత్రి వరకు గ్రామంలో కుల పంచాయతీ నిర్వహించి, “కుల కట్టుబాట్లు అతిక్రమించారని” ఆరోపిస్తూ రూ.2 లక్షలు జరిమానా కట్టాలని కుల పెద్దలు షరతు పెట్టినట్లు బాధితులు తెలిపారు. తాము అంత మొత్తం చెల్లించలేమని, రూ.50 వేలు మాత్రమే ఇవ్వగలమని వేడుకున్నప్పటికీ ఎలాంటి కనికరం చూపలేదని ఆరోపించారు.

దిక్కుతోచని పరిస్థితిలో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించినప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని, కుల పెద్దలు పోలీసులను కూడా గ్రామంలోకి రానీయకుండా అడ్డుకున్నారని తెలిపారు.

చివరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబం మీడియాను ఆశ్రయించింది.