BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 04 July 2026, 07:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో అధికలోడుతో దూసుకెళ్తున్న ఇసుక లారీలు.. ప్రమాదాలపై పట్టణవాసుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 07:55 PM
95 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడిలో అధికలోడుతో దూసుకెళ్తున్న ఇసుక లారీలు.. ప్రమాదాలపై పట్టణవాసుల ఆందోళన

ఎలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో అధికలోడుతో వేగంగా దూసుకెళ్తున్న ఇసుక లారీలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అధికంగా లోడ్ చేసి తరలిస్తుండటంతో లారీల నుంచి ఇసుక రోడ్డుపై జారిపడుతోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారుల కళ్లల్లో ఇసుక పడుతూ అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని బాధితులు వాపోతున్నారు.

ప్రధాన రహదారులపై ఇసుక లారీలు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల చిన్నపాటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక లారీల అధికలోడును అరికట్టి, వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.