BREAKING
thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Date of Publish : 05 August 2026, 04:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో సుందరీకరణ పనులు వేగవంతం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 04:26 PM
69 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని మినీ బస్టాండ్ వద్ద చేపట్టిన సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్మిస్తున్న వాటర్ ఫౌంటెన్ పనులను స్థానిక శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు 15న వాటర్ ఫౌంటెన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా చింతలపూడి పట్టణంలోని గురుబట్లగూడెం రహదారి కూడలిలో మరో వృత్తాకార వాటర్ ఫౌంటెన్ నిర్మాణం కూడా వేగంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే చింతలపూడి మరింత అందంగా, ఆకర్షణీయంగా మారడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

ఈ పరిశీలనలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.