BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 06:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిత్తపూరులో వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 06:49 PM
29 వీక్షణలు

కల్లాల వద్దే దళారుల దోపిడీ.. రూ.1,700–1,800కే ధాన్యం కొనుగోలు క్వింటాల్‌కు కనీసం రూ.2,600 చెల్లించాలి.. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో వరి రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని అఖిల భారత కిసాన్ మహాసభ నేషనల్ కౌన్సిల్ సభ్యులు కలపాల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, సాగునీటి కొరతను అధిగమించేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడి, వేలాది రూపాయలు వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తూ వరి సాగు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంటను చేతికి తెచ్చుకున్న రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర లభించకపోవడం ఆందోళనకరంగా మారిందన్నారు. ముఖ్యంగా చిత్తపూరు గ్రామంలో 1262 సన్న రకం వరి ధాన్యాన్ని కోసిన మరుసటి రోజే కల్లాల వద్దకు చేరుకుంటున్న దళారులు సంచికి 76 కిలోల ధాన్యాన్ని కేవలం రూ.1,700 నుంచి రూ.1,800 మధ్య మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతున్నారని తెలిపారు. రైతులు పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు, కూలీల ఖర్చులు, నీటి కొనుగోలు వ్యయం, కోత ఖర్చులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు తుఫాన్ల ప్రభావంతో బియ్యం ధరలు పెరుగుతుండగా, మరోవైపు వ్యాపారులు బియ్యం నిల్వలను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులపై భారాన్ని మోపుతున్నారని వెంకటేశ్వరరావు ఆరోపించారు. మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు మాత్రం ధాన్యానికి సరైన ధర దక్కకపోవడం వ్యవసాయ రంగంలో నెలకొన్న వ్యత్యాసానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461 కనీస మద్దతు ధర ప్రకటించిందని, అయితే ప్రస్తుత సాగు ఖర్చులు, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీసం రూ.2,600 చెల్లించేలా ధరను పెంచాలని డిమాండ్ చేశారు. కేవలం మద్దతు ధర ప్రకటించడంతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో రైతులకు ఆ ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే దళారుల చేతుల్లో రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు మాట్లాడుతూ రైతుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి, పారదర్శకమైన కొనుగోలు విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రైతులు అప్పులు చేసి పంటలు పండిస్తున్న తరుణంలో గిట్టుబాటు ధర అందకపోతే వ్యవసాయం మరింత భారంగా మారుతుందని పేర్కొన్నారు. చిత్తపూరు సహా చాట్రాయి మండలంలోని వరి రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిశీలించి, ధాన్యం కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని కలపాల వెంకటేశ్వరరావు, చాట్ల బాబురావు ప్రభుత్వాన్ని కోరారు.