BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 07:07 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ: దావ వసంత సురేష్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
26 Sep, 2026 - 07:07 PM
10 వీక్షణలు

జగిత్యాల: బహుజనుల ఆత్మగౌరవానికి, అణగారిన వర్గాల హక్కుల పోరాటానికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం మొరపల్లి గ్రామంలోని ఆమె విగ్రహానికి రజక సంఘాల నాయకులు, మహిళలు, గ్రామస్తులు, బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మను ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరూ ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు.

ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ముందుకు సాగిందని దావ వసంత సురేష్ అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రజకుల సంక్షేమం కోసం ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణం, 250 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలు అమలు చేసినట్లు ఆమె గుర్తుచేశారు.

అనంతరం ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ఆమె విమర్శలు చేశారు. చాకలి ఐలమ్మ భూమి హక్కుల కోసం పోరాడారని, ప్రస్తుతం పేదల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా హక్కులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, భూ సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణలో పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు పోరాటాలు కొనసాగాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగరాజం, వార్డు సభ్యులు రోజా విజయ్, బీఆర్‌ఎస్‌ నాయకులు లింగారెడ్డి, గంగారావు, గంగారెడ్డి, అబ్దుల్, అర్షిత్ రావు, రామ్మోహన్ రెడ్డి, రజక సంఘం నాయకులు లింగన్న, ప్రశాంత్, నారాయణ, గంగన్న, తిరుపతి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.