BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 05:35 pm
Posted by : BOYA SWAMY

ఉరుమడ్లలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
26 Sep, 2026 - 05:35 PM
57 వీక్షణలు

ఉరుమడ్ల, సెప్టెంబర్ 26: ఉరుమడ్ల గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, తెగువ, పోరాట స్ఫూర్తిని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిందని పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని నాయకులు అన్నారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన వీరనారిగా ఐలమ్మ సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, ఏఎంసీ డైరెక్టర్ కొనేటి యాదగిరి, టీయూవీ జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, వార్డు సభ్యులు జనపాల శ్రీను, మందుగుల పార్వతమ్మ, పాకాల దినేష్, పంచాయతీ కార్యదర్శి ఎలేండర్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.