BREAKING
thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్
Date of Publish : 21 October 2026, 12:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ ఎంపీటీసీ అభ్యర్థి తీర్థాల అద్భుతరావు గెలుపే లక్ష్యంగా టీడీపీ ఇంటింటి ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Oct, 2026 - 12:59 PM
175 వీక్షణలు

అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను కలిసిన కూటమి నాయకులు

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చనుబండలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి తీర్థాల అద్భుతరావు గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని, కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

మంత్రి కొలుసు పార్థసారథి నాయకత్వంలో చనుబండ పంచాయతీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. గ్రామంలో మరిన్ని సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే ఎంపీటీసీగా తీర్థాల అద్భుతరావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

గ్రామ సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల సాధనకు కృషి చేయడమే తమ లక్ష్యమని ప్రచారంలో నాయకులు వివరించారు. ప్రతి ఇంటికీ వెళ్లి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

ఈ కార్యక్రమంలో చనుబండ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు చీదిరాల మారేశ్వరరావు, ఎంపీటీసీ అభ్యర్థి తీర్థాల అద్భుతరావు, చనుబండ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ బొద్దుకోల నరేంద్ర, కందుల శివన్నారాయణ, దార్ల సురేష్, తోట రాంబాబు, మొండ్రు వెంకటేశ్వరరావు, మారాజు వెంకటేశ్వరరావు, మర్సకట్ల శ్రీనివాసరావుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.