BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 07:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ ఎస్టీ కాలనీలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Sep, 2026 - 07:10 PM
61 వీక్షణలు

చిన్నారుల పోషణ, గర్భిణులు–బాలింతల ఆరోగ్యంపై అవగాహన.. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు సన్మానం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ ఎస్టీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన మాసోత్సవాల్లో భాగంగా చేపట్టిన సేవా కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారుల పోషకాహారం, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, పిల్లల భద్రత, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలపై ఈ సందర్భంగా విస్తృతంగా అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ గాయత్రీ దేవి, బీజేపీ ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలు, పౌష్టికాహారం, కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, పోషకాహారం అందుతున్న విధానం, తల్లులకు ఇస్తున్న సూచనలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గాయత్రి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భధారణ సమయంలో సరైన పోషకాహారం తీసుకోవడం తల్లితో పాటు శిశువు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమన్నారు. ప్రసవం అనంతరం బాలింతలు కూడా తగిన ఆహారం తీసుకోవాలని, చిన్నారులకు అవసరమైన పోషకాహారం అందించడంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పౌష్టికాహారాన్ని అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బియ్యం, కందిపప్పు, నూనెతో పాటు బాల సంజీవిని కిట్లు, రాగిపిండి, అటుకులు, బెల్లం, ఎండు ఖర్జూరం, పాలు, గుడ్లు, వేరుశనగ చిక్కి వంటి పోషక పదార్థాలను ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వయసున్న చిన్నారులకు బాలామృతం, పాలు, గుడ్లు అందిస్తున్నామని, మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు.

బుర్రి శ్రీకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వ పథకాల ప్రయోజనం చిట్టచివరి వ్యక్తికి కూడా అందాలన్నదే లక్ష్యమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కేవలం పౌష్టికాహారం అందించడం మాత్రమే కాకుండా వారి శారీరక, మానసిక వికాసానికి అవసరమైన ఆటలు, పాటలు, విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. చిన్నారుల భద్రత విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలపై చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా నిరంతరం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

అంగన్వాడీ కేంద్రంలో అందుతున్న పౌష్టికాహారం, ఇతర సేవలపై పిల్లల తల్లులను శ్రీకర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాలు సక్రమంగా అందుతున్నాయా, పిల్లలకు నిర్ణీత మెనూ ప్రకారం ఆహారం అందుతోందా, అంగన్వాడీ కేంద్రంలో ఎదురవుతున్న సమస్యలు ఏమిటి అనే విషయాలను తల్లులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య సర్వేలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తల సేవలను అభినందించారు.

చిన్నారుల ఆరోగ్యం, తల్లుల సంక్షేమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించడంలో, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన సూచనలు అందించడంలో వారి సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.

మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. పరిమిత వేతనాలతో ఇంటింటికీ తిరుగుతూ విధులు నిర్వహించాల్సి వస్తోందని, పని భారం పెరుగుతున్నప్పటికీ తమకు అందుతున్న పారితోషికం సరిపోవడం లేదని తెలిపారు. అంగన్వాడీ విధుల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, సహాయకులు, ఆశా కార్యకర్తల కుటుంబాలకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సేవలను గుర్తించి వేతనాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఆరు సంవత్సరాలు పూర్తైన బాలబాలికలను అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రాథమిక విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని శ్రీకర్ సూచించారు. చిన్నారుల భవిష్యత్తుకు తొలి దశలోనే మంచి పునాది వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులపై ఉందన్నారు.

కార్యక్రమం అనంతరం అంగన్వాడీ సూపర్‌వైజర్ గాయత్రీ దేవి తో పాటు తొమ్మిది అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలను బీజేపీ నాయకులు శాలువాలతో సత్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చాగంటి వాసుదేవరావు, నెక్కలపు వెంకటేశ్వరరావు, మండల నాయకులు చిట్టెం శ్రీనివాసరావు, కూరపాటి బాబ్జి, బజ్జూరు గోపికృష్ణ, మోదుగు ముత్తయ్య, మోదుగు లక్ష్మీ, విమల కుమారి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆర్. భారతి, జె. జ్యోతి, జె. దుర్గాభవాని, జి. సరోజినీ, ఎం. ముకుంద, బి. అనిత, ఈ. శ్రీదేవి, సీహెచ్. వెంకటరమణ, ఎం. కుమారి, కె. లక్ష్మి, కె. విజయ, ఎం. కృష్ణకుమారి, ఎం. సునీతతో పాటు అంగన్వాడీ సహాయకులు రజిని, ప్రమీల, దేవకుమారి, లీలావతి, లక్ష్మీకాంతమ్మ, వెంకటేశ్వరమ్మ, శిరీష, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యతో పాటు గర్భిణులు, బాలింతల సంక్షేమంపై గ్రామస్థాయిలో అవగాహన పెంచే కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.