BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 01:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ గ్రంథాలయంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 01:41 PM
46 వీక్షణలు

వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, మెరిట్‌ ధ్రువపత్రాల ప్రదానం

చాట్రాయి, నవంబర్ 20: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు గ్రంథాలయాలు కీలక వేదికలుగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చనుబండ శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారం రోజులపాటు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు, మెరిట్‌ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వి. వెంకటేశ్వరరావు, కె. లంకేశ్వరమ్మ, గ్రామ రెవెన్యూ అధికారి శోభన్‌బాబు హాజరయ్యారు. విజేతలకు వారి చేతుల మీదుగా బహుమతులు, ధ్రువపత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు చిన్ననాటి నుంచే వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరగడమే కాకుండా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని వివరించారు. పుస్తకాలు మనిషికి జీవితాన్ని అర్థం చేసుకునే పరిజ్ఞానాన్ని అందిస్తాయని, ప్రతి విద్యార్థి చదువుతో పాటు పఠనాన్ని అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల్లో నిర్వహించే వ్యాసరచన, వక్తృత్వం తదితర పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రంథాలయాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో పాటు పాఠకుల సంఖ్య కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఇతర అతిథులు సైతం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వారం రోజులపాటు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, మెరిట్‌ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. కార్యక్రమాన్ని చనుబండ శాఖా గ్రంథాలయాధికారి కె. శ్రీకాంత్‌ సమన్వయం చేసి నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.