BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 08 October 2026, 04:19 pm
Posted by : V శ్రీనివాస్

విద్యార్థుల ఆకలికి చెక్.. పౌష్టికాహార కార్యక్రమం ప్రారంభం

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Oct, 2026 - 04:19 PM
7 వీక్షణలు

మందమర్రి: పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆకలి బాధను తీర్చడంతో పాటు ఆరోగ్యకరమైన విద్యకు బాటలు వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని శంకరపల్లి గ్రామంలో గురువారం ప్రారంభించారు. మందమర్రి మండలంలోని శంకరపల్లి ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ పెరుమండ్ల వెంకటేష్, ఉపాధ్యాయులు మద్ది లక్ష్మణ్, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఖాళీ కడుపుతో చదువుపై దృష్టి సారించలేరని, కడుపునిండా పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటూ చదువులో రాణించే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుని ఉన్నత చదువులు అభ్యసించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆరోగ్య సదస్సు నిర్వహించి విద్యార్థులు, తల్లిదండ్రులకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు, పౌష్టికాహారం లోపంతో కలిగే శారీరక, మానసిక సమస్యలపై వివరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.