BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 02:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Sep, 2026 - 02:09 PM
37 వీక్షణలు

చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి వేడుకలు పెనుగొలనులో చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని గ్రంథాలయంలో ప్రముఖ కవి, రచయిత, సంఘసంస్కర్త చిలకమర్తి లక్ష్మీనరసింహం 159వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగు సాహిత్యంలో కవి, రచయిత, నాటకకర్తగా విశిష్ట సేవలు అందించారని తెలిపారు. సాహిత్యంతో పాటు సామాజిక సంస్కరణల కోసం కూడా ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి పాఠశాలను స్థాపించి తన సేవాభావాన్ని చాటుకున్నారని వివరించారు.

‘దేశమాత’ వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తూ ప్రజల్లో దేశభక్తి, స్వాతంత్య్ర స్ఫూర్తిని కలిగించేందుకు కృషి చేశారని వక్తలు గుర్తుచేశారు. కేవలం 22 ఏళ్ల వయసులో ఆయన రచించిన ‘గయోపాఖ్యానం’ నాటకం లక్షకు పైగా ప్రతులు అమ్ముడవడం తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన ఘట్టంగా పేర్కొన్నారు.

చూపు కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాహిత్య సృజనను కొనసాగించిన చిలకమర్తి లక్ష్మీనరసింహం, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకువచ్చారని కొనియాడారు. ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ వంటి దేశభక్తి భావాలను ప్రతిబింబించే రచనలతో ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించారని తెలిపారు.

కవిగా, రచయితగా, నాటకకర్తగా, సంఘసంస్కర్తగా, ఉపాధ్యాయుడిగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వాహకులు తెనాలి వెంకటేశ్వర్లు, సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, మువ్వా వీరభద్రం, నామా రవి, గ్రామస్తులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.