BREAKING
thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● జనగాం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్
మంచి మాట
Date of Publish : 28 October 2026, 10:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Oct, 2026 - 10:33 AM
23 వీక్షణలు

రాత్రి 1.30 గంటల వరకు సమీక్ష..

ఉదయం 6.15 గంటలకు మళ్లీ టెలికాన్ఫరెన్స్ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో అప్రమత్తమైన యంత్రాంగం తుఫాన్ సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు అమరావతి: అర్నబ్ తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులు, ప్రజల భద్రత, సహాయక చర్యల అమలుపై కలెక్టర్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాత్రంతా తుఫాన్ ప్రభావం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల వరకు పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెప్పించుకుంటూ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం 6.15 గంటలకు మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్షించారు. తుఫాన్ తీరం దాటుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయని, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రభావిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, రహదారులపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ తీవ్రత తగ్గిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. చెరువులు, కాల్వలు పొంగిపొర్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి ప్రవాహాలపై నిరంతర నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. టెలికాన్ఫరెన్స్‌లో జిల్లాల వారీగా కలెక్టర్లు తమ పరిధిలో చేపడుతున్న సహాయక చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. కోనసీమ జిల్లాలో సుమారు 6 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఈదురుగాలులు కొనసాగుతున్నాయని వివరించారు. దీంతో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టే సమయంలో సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.