BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 09:51 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
08 Oct, 2026 - 09:51 PM
11 వీక్షణలు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, సాగునీరు, మౌలిక వసతులు, కరువు పరిస్థితులు తదితర అంశాలపై ప్రధానితో చర్చించారు.

ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని చంద్రబాబు కోరారు. గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలకు నీటి భద్రత కల్పించే అవకాశం ఉందని వివరించారు.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖపట్నం మెట్రో రైల్, బీచ్ కారిడార్ వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, ఆర్థిక సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు కూడా కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు తీవ్రంగా నమోదైందని చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. జూన్ నుంచి ఆగస్టు మధ్య సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53.4 శాతం లోటు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కరువు ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన కేంద్ర సహాయం అందించాలని చంద్రబాబు కోరారు.

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఉపశమన చర్యలు చేపట్టేందుకు కేంద్ర సహకారం అవసరమని చంద్రబాబు వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై కూడా ప్రధానితో చర్చించినట్లు సమాచారం.