BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 05:40 pm
Posted by : VALLAPU KOTESH

పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండ

తెలంగాణ
/ నల్గొండ / నాంపల్లి
Reporter
Vallapu Kotesh Nampally Mandal
13 Nov, 2026 - 05:40 PM
38 వీక్షణలు

వైద్య ఖర్చులు భరించలేని బాధితులకు ఆర్థిక భరోసా.. వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్సల ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. అర్హులైన బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంతో పాటు కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు

మండల కేంద్రంలోని పెద్దిరెడ్డి రాజు నిలయంలో వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కత్తి రవీందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్య చికిత్సల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని, దీంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

పేదరికం కారణంగా ఏ ఒక్కరికీ మెరుగైన వైద్యం అందకుండా ఉండకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి ఆర్థిక సాయం అందిస్తోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను అందుకున్న లబ్ధిదారులు కత్తి రవీందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవరెడ్డి (రాజు), గాలెంక వినోద్ కుమార్, చిలుకూరి బిక్షం, మెగావత్ చిట్టి శ్రీనివాస్, బత్తుల వంశీ, బిరుదోజు యాదమ్మ, బుషిపాక అరుణ, మేకల రమేష్ ముదిరాజ్, బొమ్ము సంతోష చంద్రశేఖర్, పంతు నాయక్, చందు నాయక్, వడ్లకొండ రమేష్ యాదవ్, పానుగంటి వెంకటయ్య గౌడ్, గాదేపాక నాగరాజు, వీరమల్ల సందీప్ గౌడ్, మాజీ సర్పంచ్ రేవల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.