BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 08 October 2026, 12:22 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్ నగరంలో రహదారులు, ట్రాఫిక్, పారిశుద్ధ్యంపై కలెక్టర్ తనిఖీ

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
08 Oct, 2026 - 12:22 PM
6 వీక్షణలు

హనుమకొండ: జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్నతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రహదారుల పరిస్థితి, ట్రాఫిక్ నిర్వహణ, ఆక్రమణలు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.

గోపాలపూర్, కల్లుమండువా జంక్షన్, చింతగట్టు, రామారం, కాకతీయ యూనివర్సిటీ రెండో గేట్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు రహదారుల వెంట ఉన్న పరిస్థితులను పరిశీలించారు. ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న ప్రాంతాలను గుర్తించి సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.

రహదారుల వెంట ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు, డబ్బాలు, ఇతర ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ రహదారులు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.