BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 07:39 pm
Posted by : K MAHESH

కాంగ్రెస్ నేత బాలాజీ నాయక్ తండ్రి మృతి పట్ల నాయకుల సంతాపం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 07:39 PM
15 వీక్షణలు

గుగులోతు దాశ్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు.. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా

నెల్లికుదురు, నవంబర్ 13: మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ తండ్రి గుగులోతు దాశ్రు నాయక్ మృతి పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధాకరమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్, మాజీ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ జ్యోతిక రమేష్ పేర్కొన్నారు.

శుక్రవారం నెల్లికుదురు మండలంలోని రత్తిరాం తండాకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు గుగులోతు దాశ్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు పార్టీకి కూడా తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు.

అనంతరం బాలాజీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న బాలాజీ నాయక్ త్వరగా కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. పార్టీ ఎల్లప్పుడూ ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని నాయకులు తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు నాయిని సత్యపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుగులోతు భాస్కర్ నాయక్, మండల నాయకులు ఆకుతోట సతీష్, రాస వెంకటరెడ్డి, దాసరి ప్రకాష్, గుగులోతు దేవేందర్‌తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.