BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 08 October 2026, 04:14 pm
Posted by : VALLAPU KOTESH

మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

తెలంగాణ
/ నల్గొండ / మర్రిగూడ
Reporter
Vallapu Kotesh Nampally Mandal
08 Oct, 2026 - 04:14 PM
28 వీక్షణలు

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: మర్రిగూడలో కాంగ్రెస్ నిరసన

మర్రిగూడ, అక్టోబర్ 08: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిని నిరసిస్తూ, ప్రజాస్వామ్యం, ఓటు హక్కుల పరిరక్షణ కోసం ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు మర్రిగూడ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలతో మండల పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ప్రతిపక్ష నాయకులను నిరసన కార్యక్రమాల సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఖండించారు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా అంశాలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై నిర్బంధ చర్యలు చేపట్టడం సరికాదని వారు అన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, స్వతంత్రతను కాపాడాలని, ఓటర్ల హక్కులకు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజల ఓటు హక్కుకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బస్టాండ్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కొనసాగిస్తూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయాలని, ఓటు హక్కును పరిరక్షించాలని నినాదాలు చేశారు.

అనంతరం మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు లభించిన ఓటు హక్కు, ఇతర ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజల ఓటు హక్కుకు భంగం కలిగించే చర్యలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ప్రజల గొంతుకను అణిచివేసే చర్యలకు స్వస్తి పలికి, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని కోరారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మండల కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.