BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 08 October 2026, 01:14 pm
Posted by : KOLA MAHESH

బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
08 Oct, 2026 - 01:14 PM
2 వీక్షణలు

నారాయణపురం: మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర సీనియర్ నాయకులు, INDIA కూటమి ఎంపీలపై పోలీసులు బలప్రయోగం చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తూ, ఏఐసీసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎన్నికల జాబితా సవరణలు, ‘ఓట్ చోరీ’ ఆరోపణలపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, INDIA కూటమి ఎంపీలు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసుల చర్యలు, లాఠీచార్జ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనికి నిరసనగా అక్టోబర్ 8న దేశవ్యాప్తంగా ‘భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే’గా పాటించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో నారాయణపురం మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మండల నాయకులు, ఇతర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.