BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 08 October 2026, 12:22 pm
Posted by : V శ్రీనివాస్

ఓట్ల తొలగింపు ప్రక్రియపై మందమర్రిలో కాంగ్రెస్ నిరసన

తెలంగాణ
/ మంచిర్యాల / మందమర్రి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Oct, 2026 - 12:22 PM
10 వీక్షణలు

మందమర్రి: ఓట్ల తొలగింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని అన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరసన కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.

నిరసన కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనారిటీ విభాగం, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఓటు హక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పాత బస్టాండ్ పరిసరాల్లో సందడి నెలకొంది.