రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన
రామన్నపేట: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన అంశాలపై తమ పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల నిరసనలకు అవకాశం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బిక్షం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, పూస బాలకిషన్, అబ్రహం కుమార్, గుత్తా నర్సిరెడ్డి, వనం చంద్రశేఖర్, ఎండీ అక్రమ్, అంజిరెడ్డి, ఎండీ నాసర్, శంబాల వెంకన్న, కోట సుధాకర్, బొడ్డు సురేందర్‌రావు, అయ్యాడపు నర్సిరెడ్డి, లింగారెడ్డి, ఇనాయత్ బేగ్, జానీ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.