BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు
Date of Publish : 02 October 2026, 08:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు మండలంలో రూ.1.98 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Oct, 2026 - 08:30 PM
6 వీక్షణలు

తిరువూరు మండలంలో రూ.1.98 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం పల్లె పండుగ–3.0లో భాగంగా ఎనిమిది గ్రామాల్లో శంకుస్థాపనలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా పల్లె పండుగ–3.0 కార్యక్రమం ద్వారా ఎనిమిది గ్రామాల్లో రూ.1.98 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అక్టోబర్ 2న శంకుస్థాపనలు చేశారు.

తిరువూరు మండలంలోని కోకిలంపాడు, మల్లెల, ఆంజనేయపురం, కొమ్మిరెడ్డిపల్లి, ఎరుకోపాడు, గానుగపాడు, జి.కొత్తూరు, చౌటపల్లి గ్రామాల్లో ఈ పనులు చేపట్టనున్నారు.

గ్రామాల వారీగా మంజూరైన నిధులు కోకిలంపాడు – రూ.36 లక్షలు మల్లెల – రూ.36 లక్షలు ఆంజనేయపురం – రూ.18 లక్షలు కొమ్మిరెడ్డిపల్లి – రూ.36 లక్షలు ఎరుకోపాడు – రూ.18 లక్షలు గానుగపాడు – రూ.18 లక్షలు జి.కొత్తూరు – రూ.18 లక్షలు చౌటపల్లి – రూ.18 లక్షలు

ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే గ్రామాల్లో రాకపోకలకు సౌకర్యం మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తగ్గనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.