BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 05:55 pm
Posted by : K MAHESH

భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 05:55 PM
25 వీక్షణలు

నిర్ణీత గడువులోగా మహిళా సమాఖ్య భవనాలు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు పూర్తి చేయాలి: ఎంపీడీవో వి. అద్వైత

ఖానాపూర్, నవంబర్ 13: గ్రామాల్లో చేపట్టిన మహిళా సమాఖ్య భవనాలు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎంపీడీవో వి. అద్వైత సూచించారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని అశోక్‌నగర్, రంగాపూర్, ధర్మారావుపేట గ్రామాల్లో ఎంపీడీవో పర్యటించారు. ఆయా గ్రామాల్లోని మహిళా సమాఖ్య భవనాల వద్ద కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణాల కోసం స్థలాలను పరిశీలించి, నిర్మాణాలకు సంబంధించి మార్కింగ్‌లు ఇచ్చారు. అదేవిధంగా ధర్మారావుపేట హైస్కూల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనుల పురోగతిని పరిశీలించారు.

అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. మహిళా సమాఖ్య భవనాలతో పాటు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. నిర్మాణ పనులకు సంబంధించిన మెటీరియల్ చెల్లింపులు 15 రోజుల్లోపు జరిగే అవకాశం ఉన్నందున, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న వీబీజీ రామ్‌జీ, జలసిరి పనులను కూడా వేగవంతం చేయాలని అన్నారు. అన్ని గ్రామాల సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకొని తమ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పనులు సకాలంలో పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో స్పష్టం చేశారు.