BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 03:43 pm
Posted by : PAGADALA DEVAIAH

సాహెబ్‌నగర్‌లో విద్యాభివృద్ధికి రూ.85 లక్షలతో నిర్మాణ పనులు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
13 Nov, 2026 - 03:43 PM
30 వీక్షణలు

నూతన అంగన్‌వాడీ భవనం, ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి గదులు.. పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 13 (Ntoday News): విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో సాహెబ్‌నగర్‌లో రూ.85 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్‌నగర్‌లో త్రినేత్ర ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

సుమారు రూ.85 లక్షల వ్యయంతో నూతన అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించడంతో పాటు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు, పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు అంగన్‌వాడీ స్థాయి నుంచే మెరుగైన వసతులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించడం ద్వారా విద్యా బోధనకు మరింత అనుకూలమైన వాతావరణం కల్పించవచ్చని వివరించారు.

ప్రాథమిక విద్యా స్థాయి నుంచే విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ నిర్మాణ పనులు పూర్తయితే అంగన్‌వాడీ చిన్నారులతో పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అదనపు వసతులు అందుబాటులోకి రానున్నాయి.

ఈ కార్యక్రమంలో బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, మనోజ్, సతీష్ చౌదరి, మహేష్, శ్రీకాంత్‌రెడ్డి, సంతోష్‌రావు, నరేష్, రాజు యాదవ్, పాఠశాల ప్రిన్సిపాల్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.