శ్రీనివాస్ రెడ్డి మృతికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన ఏనుగు శ్రీనివాస్ రెడ్డి పార్థివదేహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.