BREAKING
thumb ● పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయ పాఠాలు.. thumb ● మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో అవగాహన నడక thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● పుస్తక జ్ఞానంతో పాటు వ్యవసాయ పాఠాలు.. thumb ● మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో అవగాహన నడక thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి
Test 4
Date of Publish : 13 November 2026, 05:59 pm
Posted by : K MAHESH

యువ పరివర్తన సంస్థ ఆధ్వర్యంలో కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్‌కు ఘన సన్మానం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 05:59 PM
23 వీక్షణలు

విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు అవసరం.. యువత నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి: కౌన్సిలర్ శ్రీధర్

నర్సంపేట, నవంబర్ 13: సీపీఎం పార్టీ తరఫున నర్సంపేట పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన హన్మకొండ శ్రీధర్‌ను యువ పరివర్తన సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పట్టణంలోని యువ పరివర్తన సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ నిత్య విద్యార్థినేనని పేర్కొన్నారు. మనిషి జీవితంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలు ఉంటే సరిపోదని, వాటితో పాటు వృత్తి నైపుణ్యాలు కూడా అవసరమని తెలిపారు. యువత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు. కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్ వంటి వృత్తి నైపుణ్య కోర్సులు నేర్చుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయని, తద్వారా ఆర్థికంగా ఎదగవచ్చని పేర్కొన్నారు.

యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతరం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవడం ద్వారా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు.

అనంతరం యువ పరివర్తన నర్సంపేట మేనేజర్ సతీష్ అడ్డ మాట్లాడుతూ.. యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని అన్నారు. విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువ పరివర్తన సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.