తవ్వా విద్యాసాగర్ రెడ్డిని పరామర్శించిన దద్దాల నారాయణ యాదవ్
పార్టీ నాయకుడు తవ్వా విద్యాసాగర్ రెడ్డిని పరామర్శించిన దద్దాల నారాయణ యాదవ్
పామూరు: ప్రకాశం జిల్లా ఆర్టీఐ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్, పామూరు మండలం రేగిచెట్లపల్లి గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు తవ్వా విద్యాసాగర్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స తీసుకుని ప్రస్తుతం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.
విషయం తెలుసుకున్న కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మంగళవారం పామూరులోని విద్యాసాగర్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు చికిత్స, ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ త్వరగా కోలుకోవాలని దద్దాల నారాయణ యాదవ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గంగసాని హుస్సేన్ రెడ్డి, కల్లూరి రామిరెడ్డి, గట్ల విజయభాస్కర్ రెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, షేక్ గయాజ్, పల్నాటి భాస్కర్ రెడ్డి, సైకం ఏడుకొండలు రెడ్డి, చిలకల నారాయణరెడ్డి, మార్తల శివకుమార్ రెడ్డి, రాచకొండ మధు, గోడి నారాయణరెడ్డి, రాచకొండ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.