BREAKING
thumb అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం
Date of Publish : 24 September 2026, 08:52 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కాకుమాను రాజశేఖర్ మృతి పట్ల దద్దాల నారాయణ యాదవ్ సంతాపం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
24 Sep, 2026 - 08:52 PM
3 వీక్షణలు

కనిగిరి, సెప్టెంబర్ 24: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మరణం బాధాకరమని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు.

హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం గుండెపోటుతో రాజశేఖర్ మృతి చెందినట్లు సమాచారం అందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీకి, పార్టీ కార్యక్రమాలకు రాజశేఖర్ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.

పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సేవలో ఆయన చేసిన కృషి గుర్తుండిపోతుందని దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు. రాజశేఖర్ మృతి పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ కుటుంబ సభ్యులకు దద్దాల నారాయణ యాదవ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, మనోస్థైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షించారు. రాజశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్లు తెలిపారు.