అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్
అనకాపల్లి: అనకాపల్లి గవరపాలెంలోని అమ్మ కన్వెన్షన్ హాల్‌లో అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్ పదవులకు ఎన్నికలు నిర్వహించగా.. మూడు పదవులకు మొత్తం పది మంది అభ్యర్థులు పోటీపడ్డారు ఎన్నికల్లో అసోసియేషన్‌కు చెందిన సుమారు 300 మంది ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం జరిగిన ఓట్ల లెక్కింపులో అధ్యక్షుడిగా దాడి శ్రీకాంత్, కార్యదర్శిగా ద్వారపూడి కృష్ణ, ట్రెజరర్‌గా రెడ్డి భాస్కర్ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను కోటిపల్లి చంద్రశేఖర్, చందక నరసింహారావు, సురేష్, శ్రీను, గణేష్ అబ్జర్వర్లుగా వ్యవహరిస్తూ పర్యవేక్షించారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శి, ట్రెజరర్‌లకు అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.