డీజే సౌండ్‌కు ఊడిపడ్డ ఇంటి పైకప్పు పెచ్చులు
జాతీయం
మెదక్ జిల్లా రామాయంపేటలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్‌తో ఇంటి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డ ఘటన చోటుచేసుకుంది.
వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు పెద్దఎత్తున డీజే సౌండ్ ఏర్పాటు చేసి తెల్లవారుజాము వరకు డ్యాన్స్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో భారీ శబ్దానికి సమీపంలోని ఓ ఇంటి పైకప్పు పెచ్చులు ఊడిపోయాయి.
ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళపై పెచ్చులు పడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.