BREAKING
thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Date of Publish : 11 October 2026, 03:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Oct, 2026 - 03:08 PM
50 వీక్షణలు

బాలా త్రిపురసుందరి దేవిగా పార్వతి అమ్మవారి దర్శనం.. మెట్టగుట్టలో ఆదిలక్ష్మి అలంకరణ

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు గ్రామ సరిహద్దులోని మెట్టగుట్ట శేషాచల శ్రీనివాస స్వామి ఆలయంలోనూ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, అమ్మవారి అలంకరణలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

పెనుగోలనులోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాల తొలిరోజు పార్వతి అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, కుంకుమ పూజలు నిర్వహించారు. వేద పండితులు సుబ్రహ్మణ్య శాస్త్రి వేదమంత్రాల పారాయణం మధ్య ఆలయ గోపుర శిఖరానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపతి హోమాన్ని వైభవంగా నిర్వహించారు. పలువురు దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఉత్సవాల ప్రారంభానికి ముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవత ముత్యాలమ్మకు కావిడి సేవ నిర్వహించారు. మేళతాళాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వూటుకూరు నారాయణరావు తెలిపారు.

మెట్టగుట్టలో ఆదిలక్ష్మి అలంకరణ

పెనుగొలను గ్రామ సరిహద్దులోని మెట్టగుట్ట శేషాచల శ్రీనివాస స్వామి ఆలయంలోనూ దసరా ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల తొలిరోజు అమ్మవారిని ఆదిలక్ష్మి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో భక్తుల సహకారంతో ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పంది వెంకటరావు తెలిపారు.

దసరా ఉత్సవాల ప్రారంభంతో పెనుగొలనం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అమ్మవారి అలంకరణలు, అన్నదాన కార్యక్రమాల ద్వారా భక్తులు దైవదర్శనం చేసుకుంటూ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.