BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 08:50 am
Posted by : K MAHESH

బైక్‌ను ఢీకొట్టి 7 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డీసీఎం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 08:50 AM
35 వీక్షణలు

ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలు.. స్థానికులు అడ్డుకోవడంతో ఆగిన వాహనం.. డ్రైవర్‌పై కేసు నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు :

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన డీసీఎం వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బైక్‌ను ఢీకొట్టి సుమారు ఏడు కిలోమీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ పక్కనే ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం హైస్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. పాటిమట్ల గ్రామంలోని హైస్కూల్ సమీపంలో ఓ బైక్ రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. అదే సమయంలో వేగంగా వచ్చిన డీసీఎం వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పక్కనే ఉన్న ఎడవెల్లి సాగర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కూడా డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్లాడు.

దీంతో బైక్ డీసీఎం వాహనానికి చిక్కుకుని సుమారు ఏడు కిలోమీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లబడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు అప్రమత్తమై డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీసీఎం డ్రైవర్ పోచం సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే. సతీష్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని, మద్యం మత్తులో డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వాహనాలను నడిపేటప్పుడు వేగ నియంత్రణ పాటిస్తూ ఇతరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.