BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 06:20 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ముద్రా, స్టాండ్‌-అప్ ఇండియా పథకాల గడువు మరో ఐదేళ్లు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
13 Nov, 2026 - 06:20 PM
23 వీక్షణలు

2031 మార్చి 31 వరకు కొనసాగింపు.. కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్

పుంగనూరు, అన్నమయ్య జిల్లా: ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండ్‌-అప్ ఇండియా పథకాల గడువును మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు అయూబ్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకాల గడువును 2031 మార్చి 31 వరకు పొడిగించడం ద్వారా చిన్న వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అయూబ్ ఖాన్ మాట్లాడుతూ.. ముద్రా యోజన కింద రుణ హామీ కోసం రూ.5,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఈ పథకం ద్వారా సుమారు రూ.12.6 లక్షల కోట్ల విలువైన రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

జన్‌ధన్ ఖాతాదారులకు రూ.10 వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం, స్వయం సహాయక బృందాలకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య రుణాలకు హామీ కల్పించే వెసులుబాటు ఉన్నట్లు తెలిపారు. ముద్రా రుణాలపై వార్షిక గ్యారెంటీ ఫీజును గతంలో ఉన్న ఒక శాతం నుంచి 0.75 శాతానికి తగ్గించడం వల్ల లబ్ధిదారులకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

స్టాండ్‌-అప్ ఇండియా పథకం ద్వారా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహికులు కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు అందించనున్నట్లు అయూబ్ ఖాన్ వివరించారు. స్వయం ఉపాధి, చిన్న పరిశ్రమల స్థాపనకు ఈ పథకాలు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీకి అయూబ్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు.