BREAKING
thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత
Test 4
Date of Publish : 25 November 2026, 08:38 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిలకలూరిపేటలో ప్రజాస్వామ్యానికి తూట్లు..

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 08:38 AM
30 వీక్షణలు

చంద్రబాబు ‘ఓటర్ మ్యాన్’ కాదు.. ‘రిగ్గింగ్ మ్యాన్’: విడదల రజిని

చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పాలన సాగుతోందని మాజీ మంత్రి విడదల రజిని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చిలకలూరిపేటలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీహార్‌ను మించిన అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటర్ మ్యాన్ కాదని, రిగ్గింగ్ మ్యాన్ అని రజిని ఘాటుగా వ్యాఖ్యానించారు. బూత్‌ల ఆక్రమణలకు పాల్పడుతూ ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులు, ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పల్నాడు జిల్లాలో రాజ్యాంగ పాలనకు బదులుగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. చిలకలూరిపేట నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా హైకోర్టు అనుమతితో నామినేషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో గూండాయిజం, బెదిరింపులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. జడ్పీటీసీ అభ్యర్థులను బెదిరించడం, కిడ్నాప్ చేయడం, గృహనిర్బంధంలో ఉంచడం ద్వారా బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు. దాడులతో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాదెండ్లకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విడదల రజిని వీడియో విడుదల చేశారు. ప్రజాప్రతినిధిగా తన పర్యటనను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. తిమ్మాపురం ఘటనలో హత్యాయత్నం కేసు (సెక్షన్ 307) నమోదైన నిందితులకు 41ఏ నోటీసులు ఇచ్చి ఎలా పంపిస్తారని పోలీసులను నిలదీశారు. ఈ వ్యవహారంపై జిల్లా అదనపు ఎస్పీ స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.