BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు
Date of Publish : 29 September 2026, 11:57 am
Posted by : DAVU RAVINDER REDDY

చౌదరిగూడలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
29 Sep, 2026 - 11:57 AM
33 వీక్షణలు

ఘట్కేసర్ రూరల్, సెప్టెంబరు 28 (Ntoday News): పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడలో పలు కాలనీల్లో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను సోమవారం డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి పరిశీలించారు.

చౌదరిగూడ సాయినగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. మల్లమ్మ కాలనీ, వెంకట సాయినగర్ కాలనీ వాసులు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరడంతో అధికారులు స్పందించారు. అయితే రోడ్డు నిర్మాణానికి సంబంధించి స్థానికుల స్థల విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో డిప్యూటీ కమిషనర్ స్థానిక నాయకులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు.

అభ్యంతరం వ్యక్తం చేసిన స్థానికులతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన అనంతరం రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. సాయినగర్ కాలనీలోని రోడ్డు నంబర్లు 4, 6తో పాటు మల్లమ్మ కాలనీ, వెంకట సాయినగర్ కాలనీ వాసులకు రోడ్డు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేశ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పులికంటి భాస్కర్‌రెడ్డి కాలనీవాసులతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.

కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఎం. సుధాకర్, డివిజన్ కాంగ్రెస్ నాయకుడు ఆర్. భోజిరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె. వినోద్‌కుమార్, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.