వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం
ఆంధ్రప్రదేశ్
/
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
వాడపల్లి: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణ రాజు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.
డిప్యూటీ స్పీకర్ భార్య, కుమారుడు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ చైర్మన్ ముదునూరి వెంకట రాజు (గబ్బర్ సింగ్), డిప్యూటీ కమిషనర్ అల్లం సూర్యచక్రధర్ రావు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం రావులపాలెం సమీపంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తూర్పుగోదావరి జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.