BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 09:33 pm
Posted by : V శ్రీనివాస్

డిజిటల్ విద్యా విధానాలను బోధనలో సమర్థవంతంగా వినియోగించాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
08 Oct, 2026 - 09:33 PM
10 వీక్షణలు

మంచిర్యాల: ప్రస్తుత సాంకేతిక యుగంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు డిజిటల్ విద్యా విధానాలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుని, వాటిని తరగతి గది బోధనలో సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య అన్నారు.

గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ ఉన్నత పాఠశాల, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, శక్తి ఐటీఐతో పాటు నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ప్రాంతంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లలో జిల్లాలోని భౌతికశాస్త్ర స్కూల్ అసిస్టెంట్ల కోసం ‘ది బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్’ అంశంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి చంద్రయ్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ వనరులను బోధనలో సమర్థవంతంగా వినియోగించడం ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి, అవగాహన, సృజనాత్మకతను పెంపొందించవచ్చని తెలిపారు. డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తూ హైస్కూల్ విద్యను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఖాన్ అకాడమీ వంటి డిజిటల్ విద్యా వనరులను ఉపాధ్యాయులు విస్తృతంగా వినియోగించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని అన్నారు. డిజిటల్ సాంకేతికతను కేవలం శిక్షణ కార్యక్రమాలకే పరిమితం చేయకుండా పాఠశాల స్థాయిలో నిరంతరం బోధనలో భాగం చేయాలని సూచించారు.

డిజిటల్ విధానాల ద్వారా విద్యార్థులకు మెరుగైన అభ్యసన అవకాశాలు కల్పించి, వారి విద్యా ప్రగతికి దోహదపడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చంద్రయ్య అన్నారు.

ఈ కార్యక్రమంలో కోర్సు కో-ఆర్డినేటర్ జంబోజు సత్తయ్య, కోర్సు ఇన్‌చార్జ్ రాజేశం, జిల్లా రిసోర్స్ పర్సన్స్ రాజన్న, అర్క కుమార్, భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.