సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడకు చెందిన కే. అనుష, గంగిశెట్టి లక్ష్మయ్య ధర్మపత్ని వరలక్ష్మి జ్ఞాపకార్థం వారి మనవడు మహేష్, సోదరి దుర్గా మాధురి సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.
సేవాభావంతో అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలను నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో చీకటి నాగేశ్వరరావు, కోన లక్ష్మీమోహన్‌రావు, కపిలవాయి జగన్మోహన్‌రావు, దూబుకుంట్ల వెంకటేశ్వరరావు, కుంట్ల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.