BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 28 September 2026, 06:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో చిన్నారులు, విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 06:23 PM
14 వీక్షణలు

చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించిన ఆరోగ్య సిబ్బంది

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం చిన్నారులు, విద్యార్థులకు నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మాత్రలను అందజేశారు.

అనంతరం చేతుల పరిశుభ్రతపై ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా డయేరియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు వంటి అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. మనం వివిధ వస్తువులను తాకడం ద్వారా చేతులపై చేరే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను సబ్బుతో చేతులు కడుక్కోవడం ద్వారా తొలగించవచ్చని వివరించారు.

భోజనం చేయడానికి ముందు, మరుగుదొడ్లు ఉపయోగించిన తర్వాత, చిన్నారులు, విద్యార్థులు ఆటలు ఆడిన అనంతరం తప్పనిసరిగా సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను దూరంగా ఉంచవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ షేక్ సుల్తానా, ఏఎన్‌ఎం రత్నమాల, ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.