BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 10:11 pm
Posted by : KOLA MAHESH

డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
26 Oct, 2026 - 10:11 PM
13 వీక్షణలు
  • ప్రాజెక్టు పూర్తికి నిర్దిష్ట గడువు ప్రకటించాలి
  • 0.5 టీఎంసీల నీటితో మునుగోడు రైతులకు ప్రయోజనం ఏది? అని ప్రశ్న
  • డిండి ప్రాజెక్టు రద్దు బీజేపీ అధికారిక నిర్ణయం కాదు
  • ప్రాజెక్టు పూర్తి గడువును ప్రకటించాలి

మునుగోడు | ఎన్ టుడే న్యూస్‌ | అక్టోబర్ 26: డిండి ఎత్తిపోతల పథకం రద్దుపై మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి భారతీయ జనతా పార్టీ అధికారిక విధానంతో సంబంధం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్ స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా సాగు, తాగునీటి హక్కుల సాధనకు బీజేపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

మునుగోడు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫ్లోరైడ్ బాధితుల అంశాలపై రాజు యాదవ్ నేతృత్వంలో బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును కలిసి సమగ్ర నివేదిక అందజేశారు.

ఈ సందర్భంగా జక్కలి రాజు యాదవ్ మాట్లాడుతూ డిండి ప్రాజెక్టును రద్దు చేయాలంటూ డీకే అరుణ చేసిన వ్యాఖ్యలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన రాష్ట్ర అధ్యక్షుడు, ఆ వ్యాఖ్యలు పార్టీ అధికారిక నిర్ణయం కాదని, నల్లగొండ జిల్లా సాగు, తాగునీటి అవసరాల కోసం బీజేపీ కట్టుబడి పనిచేస్తుందని భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

డిండి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న 0.5 టీఎంసీల నీటి కేటాయింపుపై రాజు యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వందల కిలోమీటర్ల మేర ఓపెన్ కాలువల ద్వారా నీటిని తరలించే సమయంలో ఆవిరి కావడం, భూమిలోకి ఇంకిపోవడం వల్ల 25 నుంచి 30 శాతం వరకు నీటి రవాణా నష్టాలు సంభవించే అవకాశం ఉందని వివరించారు.

ఈ లెక్కన 0.5 టీఎంసీలలో రైతులకు క్షేత్రస్థాయిలో చేరే నీరు సుమారు 0.35 టీఎంసీలకే పరిమితమవుతుందని ఆయన అంచనా వేశారు. కాలువలకు లైనింగ్ పనులు పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే, మునుగోడు ప్రాంతంలోని పంటలకు అవసరమైన నీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు.

డిండి ప్రాజెక్టు పూర్తిపై ఇతర పార్టీలపై నెపాలు వేయకుండా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని రాజు యాదవ్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యేలు ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తిచేసి చివరి ఆయకట్టుకు నీరందిస్తారో ప్రకటించాలని కోరారు.

అరకొర నీటి కేటాయింపులతో రైతులకు ప్రయోజనం కలగదని పేర్కొంటూ, ప్రాజెక్టు మూల రూపకల్పన ప్రకారం పూర్తిస్థాయిలో నీరు అందించే వరకు బీజేపీ క్షేత్రస్థాయి నుంచి అసెంబ్లీ వరకు పోరాటం కొనసాగిస్తుందని జక్కలి రాజు యాదవ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో నారాయణపురం మండల ఉపాధ్యక్షుడు సుర్వి వెంకటేష్ గౌడ్, మర్రిపెద్ది శ్రీనివాస్, రమేష్, నందు తదితరులు పాల్గొన్నారు.