పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
యాదగిరిగుట్ట
- యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
- నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి
- సమీక్షలో పాల్గొన్న అధికారులు
యాదాద్రి భువనగిరి జిల్లా | అక్టోబర్ 26 | ఎన్ టుడే న్యూస్: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించిన ఎస్పీ, ప్రతి కేసు దర్యాప్తులో పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేర నియంత్రణకు పోలీసు నిఘాను పెంచాలని, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఆదేశించారు. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా బాధ్యతతో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ నాయకుడు, సీఐ మధుసూదన్ శంకర్ గౌడ్, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.