BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 10:26 pm
Posted by : KOLA MAHESH

చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
26 Oct, 2026 - 10:26 PM
11 వీక్షణలు
  • రూ.46 లక్షలతో కాలువల పూడికతీత పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
  • ఎల్‌నినో ప్రభావంతో నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి

మహబూబాబాద్, నెల్లికుదురు | అక్టోబర్ 26 | ఎన్ టుడే న్యూస్‌: నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలను అందించడమే తన లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. సోమవారం నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో డీబీఎం-48 అనుబంధ ఎస్సారెస్పీ ఉపకాలువల పూడికతీత పనులను స్థానిక సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

86 కిలోమీటర్ల కాలువల మరమ్మతులకు రూ.46 లక్షలు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎస్సారెస్పీ కాలువలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా గత పాలకులు వాటి నిర్వహణ, మరమ్మతులపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు. తాను ఎన్నికల్లో గెలిచిన మూడు నెలల్లోనే కాలువల్లో పూడికతీత, చెట్ల తొలగింపు పనులకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సుమారు 86 కిలోమీటర్ల మేర ఉన్న కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.46 లక్షలు మంజూరు చేసిందని పేర్కొన్నారు.

ఉపకాలువల్లో పూడికతీతతో ఎస్సారెస్పీ జలాలు ఆయా గ్రామాల్లోని చెరువులకు చేరేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. సంబంధిత అధికారులు పనులను నాణ్యతతో పూర్తి చేసి, సాగునీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరుతడి పంటలు సాగు చేయాలని, నీటి లభ్యతను అంచనా వేయకుండా వరి సాగు చేసి నష్టపోవద్దని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు గ్రామాల్లో నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. భవిష్యత్తులో తాగునీటి కొరత తీవ్రంగా మారే పరిస్థితులను నివారించేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టాలని సూచించారు.

రానున్న ఆరు నెలలు అప్రమత్తంగా ఉండాలి

రానున్న ఆరు నెలల్లో విద్యుత్, తాగునీరు, సాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ముందుగానే అప్రమత్తమై నీటిని వృథా చేయకుండా వినియోగించాలని కోరారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి పరిస్థితులను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.

అనంతరం సంబంధిత శాఖ అధికారులతో కలిసి వివిధ గ్రామాల్లోని ఎస్సారెస్పీ కాలువలను ఎమ్మెల్యే పరిశీలించారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో సర్పంచులు గోగుల మమత ప్రశాంత్, విజయ ఆనంద్, భాస్కర్ నాయక్, జాటోత్ రాంసింగ్, బాలకృష్ణ, ధారావత్ భాస్కర్, ఉపసర్పంచ్ గన్న హరీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాలేరు మల్లేశం, కాంగ్రెస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్, మాజీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, నాయకులు జాటోత్ వీరన్న నాయక్, కోరే శ్రీనివాస్, బాలాజీ నాయక్, తుప్పతూరి రాజు, గోగుల అశోక్ యాదవ్, ఎస్సారెస్పీ డీఈ రాందాస్ నాయక్, ఏఈఈ ఆకుల సుష్మ, ఏఈ దుర్సోజు ప్రణయ్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.