BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 10:31 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Oct, 2026 - 10:31 PM
9 వీక్షణలు
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: పోలీసులు
  • ఓటర్లలో భద్రతపై భరోసా
  • నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

మదనపల్లె, అన్నమయ్య జిల్లా | ఎన్ టుడే న్యూస్‌: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు రాయచోటి రూరల్ సీఐ ఉలసయ్య, సంబేపల్లి ఎస్‌ఐ రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, ప్రత్యేక పోలీసు బలగాలతో సంబేపల్లిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం, ప్రజల్లో భద్రతపై నమ్మకం కల్పించడం ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు.