BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 10:28 pm
Posted by : KOLA MAHESH

మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
26 Oct, 2026 - 10:28 PM
7 వీక్షణలు
  • ఇండియా స్కూల్ లీడర్‌షిప్ అవార్డు–2026 అందుకున్న భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు
  • 15 రాష్ట్రాల విద్యావేత్తల మధ్య WASP సంస్థ నుంచి గుర్తింపు

మహబూబాబాద్ | అక్టోబర్ 26 | ఎన్ టుడే న్యూస్‌: నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శాగంటి స్వామికి ప్రతిష్ఠాత్మకమైన ఇండియా స్కూల్ లీడర్‌షిప్ అవార్డు–2026 లభించింది. అక్టోబర్ 25న న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించిన ఇండియా స్కూల్ లీడర్‌షిప్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.

15 రాష్ట్రాల విద్యావేత్తల సమక్షంలో పురస్కారం

వరల్డ్ అలయన్స్ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపల్స్ (WASP) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన విద్యావేత్తలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యారంగ ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.

WASP వ్యవస్థాపక సీఈవో డాక్టర్ దీప్ శిఖ, ఏఏఎఫ్‌టీ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ సందీప్ మార్వా, అమెరికాలోని ప్యూర్టో రికోకు చెందిన విద్యారంగ వ్యాపారవేత్త డాక్టర్ వర్జీనియా రివేరా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమక్షంలో శాగంటి స్వామికి పురస్కారం ప్రదానం చేశారు.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి గుర్తింపు

విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నాణ్యమైన విద్యాబోధన కోసం అంకితభావంతో పనిచేయడం, వారిలో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపడం తనకు ఈ అవార్డు రావడానికి కారణమని శాగంటి స్వామి తెలిపారు.

ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. అవార్డు సాధించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఉపాధ్యాయుడికి అభినందనలు

శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం లభించడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంగతాయి, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.