BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 10:14 pm
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
26 Oct, 2026 - 10:14 PM
16 వీక్షణలు
  • కట్టుంగ, వసంతవాడ, నార్కెడ్‌మిల్లి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కప్పల శ్రీధర్ ప్రచారం
  • నిత్యావసర ధరల భారంపై ప్రస్తావన
  • ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి

ఆత్రేయపురం | ఎన్ టుడే న్యూస్‌: ఆత్రేయపురం మండల వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కప్పల శ్రీధర్ సోమవారం మండల పరిధిలోని కట్టుంగ, వసంతవాడ, నార్కెడ్‌మిల్లి గ్రామాల్లో పాల నాగేశ్వరరావుతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని కప్పల శ్రీధర్ తెలిపారు. సామాన్య ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం పెరుగుతోందని, బియ్యం, పంచదార వంటి వస్తువుల ధరలు కుటుంబాల జీవనంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో నిత్యావసర ధరల భారంపై ప్రజలు ఆలోచించాలని కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమం, సామాన్యుల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యంగా పనిచేస్తానని శ్రీధర్ తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి, ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.