BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 04:48 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మృతుడని వైద్యుల నిర్ధారణ.. అంత్యక్రియలకు తరలిస్తుండగా లేచి కూర్చున్న వృద్ధుడు

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
27 Sep, 2026 - 04:48 PM
7 వీక్షణలు

చందుర్తి: వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించిన ఓ వృద్ధుడు అంత్యక్రియల కోసం అంబులెన్స్‌లో తరలిస్తుండగా అకస్మాత్తుగా లేచి కూర్చున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

సనుగుల గ్రామానికి చెందిన చీకటి శంకరయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం శంకరయ్య మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం శంకరయ్య మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్నారు. జోగాపూర్ సమీపంలో అంబులెన్స్‌లో ఉన్న శంకరయ్య అకస్మాత్తుగా లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.

వెంటనే ఆయనను వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యులతో పరీక్షలు చేయించారు. పరీక్షించిన వైద్యులు శంకరయ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

తండ్రి మృతి చెందినట్లు సమాచారం అందడంతో గల్ఫ్‌లో ఉన్న కుమారులు స్వగ్రామానికి బయల్దేరినట్లు తెలిసింది. అయితే శంకరయ్య బతికే ఉన్నాడని తెలియడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం, ఆశ్చర్యం వ్యక్తమైంది.

ఈ విషయం గ్రామంలో తెలియడంతో శంకరయ్యను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.