BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 12:13 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పోతననగర్‌లో పది రోజులుగా తాగునీటి పైపులైన్‌ లీకేజీ

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
13 Nov, 2026 - 12:13 PM
19 వీక్షణలు

మురుగు కాలువల్లోకి వృథాగా పోతున్న విలువైన నీరు.. పట్టించుకోవడం లేదంటూ స్థానికుల ఆగ్రహం

వరంగల్‌: నగరంలోని పోతననగర్‌ రహదారిపై తాగునీటి పైపులైన్‌ లీకేజీ సమస్య స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. గత పది రోజులుగా పైపులైన్‌ నుంచి మంచినీరు నిరంతరంగా లీకవుతూ మురుగు కాలువల్లోకి చేరుతోంది. దీంతో విలువైన తాగునీరు వృథా అవుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే ప్రాంతంలో గతంలో మరోచోట పైపులైన్‌ లీకేజీ ఏర్పడటంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. అయితే తాజాగా అదే రహదారిపై మరోచోట పైపులైన్‌ లీకవుతుండటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. గత పది రోజులుగా నీరు వృథాగా ప్రవహిస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు నీటిని పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం ప్రజలకు సూచిస్తుండగా, మరోవైపు పైపులైన్‌ లీకేజీల ద్వారా తాగునీరు వృథా అవుతున్నా అధికారులు అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు. ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించడంతో పాటు, ఇలాంటి లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పోతననగర్‌ రహదారిపై లీకవుతున్న పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి తాగునీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.